కుంచిత పాదమ్ము చేరి తరియించును భక్త వరులు
వంచిన ఆ పాదమ్మే త్రుంచి వేయు అఘమ్ములను
పాశుపతమ్మొసగు వేళ పార్థుని స్పర్శించి బ్రోచె
మృకండు పుత్రుని కావగ మృత్యుదేవు సంహరించే
వ్యాఘ్రపాద పతంజలుల తపస్సులను పండించి
ముదమ్మునను నర్తించెను మనో తిల్ల వనము నందు
అర్థ తనువునాక్రమించి అమ్మ కరుణ మేళవించి
శిష్య జీవ సమూహమును ఉద్ధరించి కాచుకొనగా
గురు పద రూపమున తాను తరలి వచ్చి నడయాడెను
తన కృపా నర్తనమున పులకింతను కలుగ చేయ
No comments:
Post a Comment