గురు (నట)రాజ స్వరూపం
నటరాజ దక్షిణ హస్తంలో ప్రతిధ్వనించే ఢమరుకమే దశ దిశలా మారు మ్రోగే నా గురువు ప్రవచన ఝరి
వామ హస్తం లో ధరించిన అగ్ని వారి నిత్య అనుష్ఠానం, ఉపాసన
వారి చల్లని నిర్మల మందస్మితం, దయార్ద్ర దృష్టి ని మించిన అభయం ఇంకెక్కడ పొందగలం?
అలవోకగా తరింప చేయగలననే ధీమా ఆ కుంచిత పాదాన్ని చూపే చేయి లీలగా హేలగా అందిస్తోంది కదా!
పరిపూర్ణ అనుగ్రహం వైపు పదములు వేయించే వారి శివపదాలకు అందని అనుగ్రహ నికుంచిత పదం మరేదీ కానరాదు
వీటన్నింటితో తన తపస్సు కొనసాగిస్తూ మనలోని అజ్ఞానాన్ని తన అధీనం చేసుకున్నదే ఆ నిగ్రహ దక్షిణ పదం
మా గురువు చేసే అనుగ్రహ నృత్యానికి మా అమ్మ మొదటి ప్రేక్షకురాలు.
పతంజలిలా త్రికరణాలతో అంజలిస్తూ తపించి, మీ వైపు ప్రాకి,
వ్యాఘ్ర పాదునిలా మీ పదార్చన చేయగలిగి ఎప్పటికైనా ఆ తాండవానందాన్ని దర్శించే అద్భుత ఘడియ మీ నిర్ణయమే కదా స్వామి!
No comments:
Post a Comment