ఆది భిక్షువై తిరిగే అన్నపూర్ణా పతీ
భక్తి భిక్ష నొసగి నన్ను ఆదుకొనుము పశుపతీ
తల్లి తరువు నంటుకునే అంకోలపు విత్తు భక్తి
అయస్కాంతమైన నిన్ను సూచికనై చేరు భక్తి
పరమ సాధ్వి అయిన ఇంతి మగని అనుగమించు భక్తి
పెను బలముతో వృక్షమ్మును చుట్టుకున్న లతా భక్తి
నీ ఉనికియే విశ్వమందు ఎల్లెడలా రుచియింపగ
నిన్ను తప్ప అన్యమేది కోరుకోని శుద్ధ భక్తి
సంద్రమ్మయి ప్రవహించే నీ స్వరూపము నందు
అవిభక్తంబైన రీతి చేరుకునే నదీ భక్తి.....
No comments:
Post a Comment