Monday, March 30, 2020

నీలకంఠ రహస్యం


నా జీవుడి దుష్ట సంస్కారాలు అనే భయంకరమైన విషాన్ని కొన్ని జన్మల నుండి భరిస్తూ స్వీకరిస్తూ ఉన్న స్వామికి ఈ విషం ఒక లెక్కా!! అలా స్వీకరిస్తున్నారని అంత నమ్మకం ఎందుకంటే ఇప్పుడు కనీసం ఈ మాత్రమైనా ఆయన పేరు తలవాలనే తలంపు పుట్టించడమే

అమ్మ చాలా తెలివిగా తన పుట్టుక నుంచే స్వామి భవిషత్తులో విష భక్షణం చేసినా ఆ వేడి తట్టుకొనే ఏర్పాట్లు చేస్తూనే ఉంది.
పుట్టడమే చల్లని హిమవత్ పర్వత రాజ పుత్రికగా జన్మించింది.
తలపై, ఒక నేత్రంగా, ఒక తాటంకంగా ముఖ కమలంలో చంద్రుని ధరించింది.
తన నవ్వు, చూపుల చల్లదనం ఎలాగు ఉండనే ఉన్నాయి.
ఇంత చల్లదనం నిత్యానపాయిని గా తనతోనే ఉండగా స్వామికి విష ప్రభావము ఏమి గ్లాని కలిగించగలదు?

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహి జలధి లాంఘిగయే ఆచరజ నాహి అంటూ హనుమగా వచ్చినప్పుడు అమృత తుల్యమైన, ఆనంద రస స్వరూపమైన రామ నామాన్ని తన నోట ధరించి ఉండగా ఈ విషం ఆయన్ను ఏమి చేస్తుంది?

మహా పతివ్రత అయిన అమ్మకు ఆ అయ్యకు చెందిన ఏదైనా ఎంత ఇష్టమో కదా! ఆయన ఆ కంఠ నీలిమ ఇష్టంగా ధరించారని అమ్మ తన కాళీ, రాజ శ్యామల స్వరూపాలలో ఒడలెల్ల అదే రంగుతో తన అవతార కార్యం కొనసాగించింది.
అయ్య కంఠాన ఉన్న ఆ నీలిమ లో ఎంత అందం ఉండి ఉంటుందో! అది చూసిన అమ్మ కన్నులలో ఇంకెంత అందమైన మెరుపు మెరిసి ఉంటుందో! ఆ మెరుపు కాంతులు ఇంకా తనివి తీరా దర్శించాలి అనుకున్నారేమో స్వామి!ఆ పరమాత్మయే రామునిగా, కృష్ణుని గా అవతారం స్వీకరించినప్పుడు తనువంతా అదే వర్ణం గా దర్శనం ఇచ్చారు కదా!
కృష్ణ తత్వం లో రాధమ్మ రామావతారం లో హనుమ ఏమో

No comments:

Post a Comment